చస్…ఒక్కరోజులో 5 సినిమాలు…ఏముంది ఆ డేట్ లో!!

0
720

సినిమా వాళ్లకి సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంటు ఉన్నా లేకున్నా సినిమాల రిలీజ్ విషయంలో కరెక్ట్ టైమింగ్ మిస్సవ్వకపోతే… రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. స్టార్ హీరోలయితే ఎప్పుడొచ్చినా పర్లేదు కానీ మిగిలిన వారు థియేటర్లకి జనాలను రప్పించాలంటే మంచి టైం చూసుకుని బరిలో దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా ఈ ఏడాది రంజాన్ రోజుకి కూడా ఫుల్లు డిమాండ్ ఏర్పడింది.  వేసవి సెలవుల సీజన్లో సినిమాల హడావిడి దాదాపు ముగిసినట్టే. మరికొన్ని రోజుల్లో బడులు- కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. బడులు తెరిచాక కలెక్షన్లు బాగా రాబట్టాలంటే ఏదో ఒక పండగను అడ్డం పెట్టుకుని బరిలో దిగాల్సిందే.

ఈ ఏడాది రంజాన్ జూన్ 14 సాయంత్రం ప్రారంభమై జూన్ 15 సాయంత్రం ముగిసే అవకాశం ఉంది. దాంతో ఈవారం విడుదల చేసేందుకు ఐదు సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ప్రతి ఏడాది ఈద్ కి కచ్చితంగా తన సినిమా రిలీజ్ చేసే సల్మాన్.. ఈసారి  ‘రేస్- 3’ చిత్రంతో వస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ జనాల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా జూన్ 15న విడుదల కానుంది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ కూడా గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల ముందు అనుకున్న మే 18 నుంచి వాయిదా పడి ఇదే రోజుకి ఫిక్స్ అయ్యింది.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్- పూజా హెగ్దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘సాక్ష్యం’ సినిమా కూడా జూన్ 14న డేట్ ఫిక్స్ చేసుకుంది. కామెడియన్ నుంచి హీరోగా మారిని శ్రీనివాస్ రెడ్డి తాజా చిత్రం ‘జంబ లకిడి పంబ’… ఆండ్రియా- అంజలి నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘తారామణి’ కూడా జూన్ 15న విడుదల చేస్తామని ప్రకటించారు చిత్ర యూనిట్. ఒక్కసారిగా ఐదు సినిమాలు థియేటర్లకి వస్తున్నాయంటే కలెక్షన్లు చీలడం ఖాయం. మరి వీటిలో ఎన్ని హిట్టు మెట్టు ఎక్కుతాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here