ఒక్క సినిమాతో టోటల్ సౌత్ ని దున్నేసిన యంగ్ టైగర్

0
2748

ntr-fjhjzd-fsfgsయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కూడా ఇదివరకు తెలుగుని దాటి ఇతర భాషల్లో డబ్ అవ్వడం కానీ డైరెక్ట్ గా రిలీజ్ అవ్వడం కానీ జరగలేదు. కానీ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటిసారిగా జనతాగ్యారేజ్ మలయాళంలోనూ రిలీజ్ అవ్వగా మిగిలిన రాష్ట్రాల్లో డైరెక్ట్ తెలుగు భాషలోనే రిలీజ్ అయ్యింది.

కానీ తొలి అడుగులోనే అన్ని రాష్ట్రాల్లో తన తడాఖాని చాటుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతాగ్యారేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల వైపు అడుగులు వేస్తుంటే కర్ణాటకలో 10 కోట్ల వైపు, తమిళ్-కేరళలో 5 కోట్ల వైపు దూసుకుపోతుంది.

మొదటి సినిమాతోనే ఇతర రాష్ట్రాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అతికొద్దిమంది హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పొచ్చు. ఎలాగు జనతాగ్యారేజ్ తో క్రేజ్ వచ్చింది కాబట్టి ఇకముందు చేసే సినిమాలను కూడా సౌత్ లోని అన్ని భాషల్లో డబ్ అయ్యేలా చూసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY