106…ఓవరాల్ గా ఇదీ ఎన్టీఆర్ భీభత్సం

0
811

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ ను ముగించింది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా షేర్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రికార్డు లెవల్ కలెక్షన్స్ ని అందుకోలేదు. కాగా సినిమా ఓవరాల్ గా జనతాగ్యారేజ్ లెవల్ లో 85 కోట్ల మార్క్ కి 81.5 కోట్ల షేర్ తో ముగించి ఎన్టీఆర్ కెరీర్ లో టాప్ 2 బిగ్గెస్ట్ షేర్ మూవీగా నిలిచింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో GST వలన నష్టపోయిన ఈ సినిమా మొత్తంగా టోటల్ రన్ లో 61 కోట్ల షేర్ ని అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అదే GST కనుక లేకుంటే సినిమా 68 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకునేదని సమాచారం.

కాగా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ ఏకంగా 106 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో సంచలన రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక త్రివిక్రమ్ తో చేసే సినిమా తో ఎన్టీఆర్ మరిన్ని భీభత్సాలు సృష్టించడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here