రామ్ చరణ్ మాస్ పవర్:: 10 వ రోజు ఇక్కడ కన్నా పరాయిగడ్డపై ఎక్కువ కలెక్షన్స్

0
995

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు అల్టిమేట్ కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేసింది… ఓ రేంజ్ లో వసూళ్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన ధృవ ఇక్కడికన్నా కూడా పరాయిగడ్డపై మరింత రెచ్చిపోయింది.

రామ్ చరణ్ స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ ఏరియాలో అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న ధృవ పక్క రాష్ట్రం కర్ణాటకలో 10 వ రోజు కుమ్మేసింది. సీడెడ్ లో 10 వ రోజు మొత్తంమీద 30 లక్షల షేర్ మాత్రమే వసూల్ చేసిన ధృవ కర్ణాటకలో దుమ్ము రేపింది.

దుమ్ము రేపే  రేంజ్ లో 36 లక్షల షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 47 కోట్ల మార్క్ ని అందుకున్న ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా సాగుతుంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే కచ్చితంగా 60 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY