13 వ రోజు నైజాం కన్నా సీడెడ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాడు ఎన్టీఆర్

0
957

ntr-lsjsntnsయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ గ్రాండ్ గా 75 కోట్లకు చేరువ అవుతున్న సమయంలో వరుస సెలవులు జనతాగ్యారేజ్ కి అద్బుతంగా కలిసివస్తుండటంతో ఎదురులేకుండా దూసుకుపోతుంది జనతాగ్యారేజ్ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు మరో అద్బుతం సృష్టించింది ఈ సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ సెలవును ఫుల్లుగా వాడుకున్న జనతాగ్యారేజ్ దాదాపు 1.60 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ రేంజ్ లో కలెక్షన్స్ రెండు రాష్ట్రాల్లో హెవీ వర్షాలను సైతం తట్టుకుని రావడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న నైజాం ఏరియాని మించి కలెక్షన్స్ సీడెడ్ లో రావడం.

నైజాంలో 13 వ రోజు మొత్తంగా 43 లక్షల షేర్ రాగా సీడెడ్ లో రికార్డు స్థాయిలో 46 లక్షల షేర్ ని సాధించింది. సీడెడ్ లో నికార్సయిన హిట్ కోసం ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కి జనతాగ్యారేజ్ అక్కడ దిమ్మతిరిగే క్రేజ్ ని ఇస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY