2 కోట్లు పెడితే 110 కోట్ల కలెక్షన్స్ తెచ్చిపెట్టింది ఈ సినిమా

0
7424

2 cr 110 crబాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా లెక్క ఉండదు సినిమాకు వచ్చే టాక్ ని బట్టే ఆ సినిమా భవితవ్యం ఉంటుంది. పెద్ద హీరో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి కానీ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే భారీ నష్టాలు తప్పవు. కానీ ఓ చిన్న సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో లేటెస్ట్ ఫిబ్రవరిలో విడుదల అయిన నీర్జా సినిమాను చూస్తె తెలుస్తుంది.

ఇప్పటివరకు నటిగా చెప్పుకోవడానికి ఒక్క మంచి సినిమా లేని సోనం కపూర్ నటించిన నీర్జా బాలీవుడ్ తో పాటు యావత్ ప్రేక్షకలోకాన్ని విపరీతంగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 2 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ ఇండియాలో 78 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది.

మహారాష్ట్ర-గుజరాత్-జార్ఖండ్ లాంటి చోట్ల టాక్స్ ఫ్రీ దక్కించుకోవడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి.ఇక ఓవర్సీస్ లో టోటల్ గా 37 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తంగా 110 కోట్ల కలెక్షన్స్ తో రికార్డు సాధించింది. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు.

NO COMMENTS

LEAVE A REPLY