అక్షరాలా 200 కోట్లు…ఊచకోతకి పరాకాష్ట..టోటల్ సౌత్ షాక్

0
405

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రచ్చ ఎ రేంజ్ లో ఉంటుందో ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇలయధలపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా కలెక్షన్స్ చూస్తె అర్ధం అవుతుంది. అత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డులతో దుమ్ము లేపగా ఇప్పుడు ఏకంగా సంచలన 200 కోట్ల కలెక్షన్స్ ని సాధించి టోటల్ సౌత్ ఇండస్టీకే షాక్ ఇచ్చింది.

ఈ రేంజ్ కలెక్షన్స్ చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా నోళ్ళు తెరిచేలా చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఏకంగా 105 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. ఇలయధలపతి విజయ్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో కూడా……

200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న అతి తక్కువ సినిమా లలో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. సినిమా జోరు చూస్తుంటే 250 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా 250 కోట్ల లీగ్ లో అడుగుపెడితే మిగిలిన హీరోలు ఈ మార్క్ ని అందుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here