మూడో వారంలో కూడా ఆల్ టైం రికార్డు థియేటర్స్ ని హోల్డ్ చేసిన జనతాగ్యారేజ్

0
2400

ntr-gjkhjsdggజనతాగ్యారేజ్ రిలీజ్ అయ్యి 2 వారాలు అవుతున్నా జోరు తగ్గడం లేదు….సినిమా ఫస్ట్ డే టాక్ కి అందరూ బయపడ్డా తరువాత జనతాగ్యారేజ్ కి జనాలు జయహో జనతా అని చెప్పకుండా ఉండలేకపోతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 75 కోట్ల మార్క్ ని అందుకుని కూడా జనతాగ్యారేజ్ స్లో అవ్వడం లేదు.

తొలి వారంలో మొత్తంగా 1200 థియేటర్స్ లో రిలీజ్ అయిన జనతాగ్యారేజ్ రెండో వారంలో సుమారు 800 థియేటర్స్ ని హోల్డ్ చేయగలిగింది. ఇక మూడో వారంలో ఎలాంటి పోటి లేకపోవడంతో సుమారు 600 థియేటర్స్ లో జనతాగ్యారేజ్ రన్ కాబోతుంది.

మూడో వారం నిర్మలా కాన్వెంట్ మాత్రమే రిలీజ్ అవుతుండటం అది కొందరికి మాత్రమే పరిమితం అవుతుండటంతో జనతాగ్యారేజ్ కి ఎలాంటి అడ్డు లేకుండా ఉంది. రెండో వారంలో 10 కోట్ల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ మూడో వారంలో 5 కోట్లు వసూల్ చేస్తే 80 కోట్ల మార్క్ ని అందుకుంటుంది.

NO COMMENTS

LEAVE A REPLY