ఆ థియేటర్ కెపాసిటీ 4 వేలు…3గంటల్లో వీకెండ్ ఫుల్….మెగాస్టారా-మాస్ హిస్టీరియా

0
2077

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ఉండొచ్చు కానీ మెగాస్టార్ మైటీ క్రేజ్ ముందు అందరూ దిగదుడుపే అని మరోసారి నిజం కాబోతుంది…ఖైదీనంబర్150 పై బాహుబలిని మించిన క్రేజ్ ఏర్పడింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

దీనికి చిన్న ఉదాహరణ….పక్క రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూర్ లో కళ ఊర్వశి థియేటర్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్ కెపాసిటీ ఉన్న థియేటర్స్ లో ఒకటి. సుమారు 4 వేల మంది ఇక్కడ ఒక థియేటర్ లో సినిమా చూడగలరు.

అలాంటి చోట ఖైదీనంబర్150 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్స్ అలాగే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన 3 గంటలోనే టోటల్ గా వీకెండ్ టికెట్స్ మొత్తం సేల్ అయ్యాయి అంటే మెగాస్టార్ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY