టాలీవుడ్ చరిత్రలో అక్కడ 6 కోట్లు అందుకున్న రెండో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
4815

nt-er-btsd-btఎన్టీఆర్ ఫామ్ లో ఉన్నప్పుడు రికార్డుల బెండు తీయడంలో తనని మించినవాళ్ళు ఉండరు అనేది ఇండస్ట్రీ విశ్లేషకుల వాదన. సరైన సినిమా పడితే ఎన్టీఆర్ రేంజ్ కలెక్షన్స్ ఏంటో అందరికీ తెలుస్తాయని ఎప్పటి నుండో వినిపిస్తున్న మాటని ఇప్పుడు నిజం చేశాడు యంగ్ టైగర్.

ఏ ఏరియాను వదలకుండా నయా రికార్డులతో జోరు చూపిస్తున్న యంగ్ టైగర్ జనతాగ్యారేజ్ తో గుంటూరు ఏరియాలో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డును అందుకోబోతున్నాడు. అక్కడ ఇప్పటివరకు 5 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాలే రెండు.

ఒకటి బాహుబలి 6.8 కోట్లు కాగా మరోటి శ్రీమంతుడు 5.12 కోట్లు. కాగా జనతాగ్యారేజ్ తో ఇప్పటికే 6 కోట్లు అందుకున్న ఎన్టీఆర్ బాహుబలి తరువాత అక్కడ 6 కోట్ల మార్క్ ని అందుకోబోతున్న రెండో సినిమాగా నిలవబోతుంది. అన్నీ కుదిరితే అక్కడ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY