6 నెలలుగా ఏ సినిమా చేయనిది ఈ సినిమా చేయబోతుంది

0
431

టాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. బాలీవుడ్డయినా.. స్టార్ హీరోల సినిమాలు వచ్చినపుడు ఉండే సందడే వేరు. ఐతే సౌత్ ఇండియాలో ఈ ఏడాది సూపర్ స్టార్లు నటించిన బడా సినిమాలు చాలానే వచ్చాయి కానీ.. బాలీవుడ్లో మాత్రం తొలి ఆరు నెలల్లో బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సందడి కనిపించలేదు.

6monthsjkshముఖ్యంగా ఖాన్ సినిమాల సందడి లేకపోవడంతో బాక్సాఫీస్ అనుకున్న స్థాయిలో కళకళలాడలేదు. ఐతే ఖాన్‌ల సినిమా ఒక్కటీ విడుదల కాలేదనడానికేమీ లేదు. ఏప్రిల్లో షారుఖ్ ఖాన్ సినిమా ‘ఫ్యాన్’ వచ్చింది కానీ.. ఓ ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొత్తంగా ఓ 80 కోట్లు మాత్రమే వసూలు చేaసి షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ఎయిర్ లిఫ్ట్.. భాగి.. హౌస్ ఫుల్-3 లాంటి కొన్ని సినిమాలకు మంచి వసూళ్లే దక్కినా.. గత ఏడాది ‘భజరంగి భాయిజాన్’ తరహాలో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా రాలేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కనీసం ఓపెనింగ్స్ రాబట్టే సినిమా లేక హిందీ ప్రేక్షకులు నిరాశలో ఉన్నారు. ఆ నిరాశని పోగొట్టదానికి సల్మాన్ రెచ్చిపోబోతున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY