7 రోజుల్లో సరైనోడు కన్నా అక్కడ ధృవ 1.2 కోట్ల లీడింగ్ లో ఉంది

0
585

మెగా హీరోలు అల్లుఅర్జున్ మరియు రామ్ చరణ్ నటించిన సినిమాలు రెండు గీతాఆర్ట్స్ ఈ ఇయర్ నిర్మించగా రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా సరైనోడు వీక్ టాక్ తోనూ హిస్టారికల్ వసూళ్లు సాధించింది.

కాగా ధృవ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా డీమానిటైజేషన్ తో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. అయినా కూడా రెండు సినిమాలలో పరాయి గడ్డ కర్ణాటకలో రామ్ చరణ్ దే అల్లుఅర్జున్ పై పైచేయి అయింది.

సరైనోడు తొలి వీక్ పూర్తి అయ్యే సరికి కర్ణాటకలో 4.8 కోట్ల షేర్ వసూల్ చేయగా ధృవ ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో కలిపి 6 కోట్ల షేర్ దాకా వసూల్ చేసి లీడింగ్ లో ఉందని అంటున్నారు. టోటల్ రన్ లో 7.5 కోట్లవరకు కలెక్ట్ చేసే చాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY