ఆది-సింహాద్రి ని మరిపించే విజయం యంగ్ టైగర్ సొంతం అయింది

0
860

ntr-shss-snntmnsయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో 26 సినిమాలు చేశాడు…కానీ ఇప్పటికీ అందులో బెస్ట్ ఏది అంటే అందరూ చెప్పే పేర్లు ఆది-సింహాద్రి. ఆ సినిమాల ఇంపాక్ట్ ని ఇప్పటికీ మార్చలేకపోతున్న ఎన్టీఆర్ కి ఇప్పుడు జనతాగ్యారేజ్ ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు.

టాక్ విషయంలో జనతాగ్యారేజ్ సింహాద్రిని మరిపించలేకపోయినా ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో తెలియజేస్తూ కలెక్షన్స్ సునామీ మాత్రం 2003 లో ఎలా సాగిందో అలాగే సృష్టించింది. 7 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అయిన తొలి కమర్షియల్ మూవీ ఇదే అవ్వడం విశేషం.

ఇంతకుముందు శ్రీమంతుడు లాంటి భారీ కమర్షియల్ మూవీ 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి హిట్ కొట్టడానికి 10 రోజులు ఎదురుచూడగా జనతాగ్యారేజ్ మాత్రం వారం రోజుల్లోనే ఆ మార్క్ ని క్రాస్ చేసి క్లీన్ హిట్ అయ్యింది. తద్వారా ఎన్టీఆర్ కెరీర్ లో భారీ రికార్డులు తెచ్చిపెట్టిన జనతాగ్యారేజ్ టాక్ విషయంలో ఆ రెండు సినిమాలను మరిపించకపోయినా కలెక్షన్స్ విషయంలో మాత్రం సింహాద్రిని మించిపోయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY