ఇక్కడ కూడా ఊచకోతే అంటున్న కోలివుడ్ హీరో…ఏం జరుగుతుందో మరి!

0
229

తమిళం లో రిలీజైన ‘మెర్సాల్’ అసలు సినిమా ఎలా ఉన్నా కూడా వివాదాల తో బాగానే దూసుకు పోతోంది. అయితే ఆ సినిమా తెలుగు వర్షన్ మాత్రం.. టాక్ ఎలా ఉన్నా కూడా ధియేటర్ల కే రావడం లేదు. దానికి కారణం ఎవరు ఏదని చెప్పినా కూడా.. చివర కు ఈరోజు సెన్సార్ సర్టిఫికేట్ ఫోటోలు బయ టకు రావ డంతో.. విజయ్ తెలుగు అభిమా నులు ఊపిరి పీల్చుకున్నంత పనైంది. 

ఎట్టకేలకు విజయ్ ‘మెర్సాల్’ తెలుగులో ‘అదిరింది’ అంటూ నవంబర్ 9న అదరబోతోంది. ఇలాంటి డేట్లు చాలానే ఇచ్చారుగా అనుకుంటారేమో.. ఈసారి సెన్సార్ సర్టిఫికేట్ కూడా బయటకు ఇచ్చేశారు. కాబట్టి సినిమా రిలీజ్ కావడానికి ఇతర అడ్డంకులు ఏవీ లేవు. పైగా నవంబర్ 9న సినిమాలు కూడా ఏవీ లేవు. దానితో ఆ రోజునే సినిమాను దించేయాలని ఫిక్సయిపోయారు. 

ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ లేట్ కావడం వలన.. చాలామంది పనిగట్టుకుని మరీ లీక్ చేసిన తమిళ వర్షన్ చూసి తెలుగు ప్రియులు ఎంజాయ్ చేసేస్తున్నారు. మరి ఈ సినిమాలో కార్పొరేట్ వైద్య వ్యవస్థపై హీరో విజయ్ చేసిన పోరాటం ఎంతమందికి తెలుగులో ఏ విధంగా నచ్చుతుందో చూద్దాం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here