ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్…అజ్ఞాతవాసి ఆ సినిమా కు కాపీ!!

0
3274

త్రివిక్రమ్ ఆరంభంలో తీసిన అతడు చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. వెంకటేష్ నటించిన వారసుడొచ్చాడు చిత్రాన్ని తిరగరాసిన సంగతి అప్పట్లోనే అందరూ చెప్పుకున్నారు. రీసెంట్ గా అఆ మూవీ విషయంలో అయితే పెద్ద రగడే జరిగింది. మీనా నవల నుంచి స్ఫూర్తి పొంది ఆఆ కథ రాసిన మాటల మాంత్రికుడు.. కనీసం ఆమెకు క్రెడిట్ ఇవ్వకపోవడం విమర్శలకు గురైంది. ఆ తర్వాత టైటిల్ కార్డ్ వేయించినా..

అది విమర్శల తర్వాతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి మూవీ తీస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి కూడా ఓ వెంకీ మూవీనే స్ఫూర్తి అంటున్నారు. వెంకటేష్ నటించిన ఒంటరిపోరాటం చిత్రం మాదిరిగానే అజ్ఞాతవాసి ఉంటుందట. ఇది కూడా రివెంజ్ డ్రామానే అని..

అందులో జయసుధ ఉంటే.. ఈ చిత్రంలో ఖుష్బూ కనిపిస్తుందని చెబుతున్నారు. తన పగను తీర్చుకోవడానికి పవన్ ఐడెంటిటీ మార్చి ఖుష్బూ గేమ్ ప్లాన్ ఆడుతుందట. ఇక కామెడీ విషయంలో కూడా పవన్ ఈ సారి కాస్త నెమ్మదిస్తాడని.. కానీ పవన్ చుట్టూ బోలెడంత కామెడీ ఉంటుందని తెలుస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here