ఎదురీదుతున్న హలో….ఈ కలెక్షన్స్ సరిపోవు

0
187

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో’ చిత్రం .. ఈ నెల 22వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోని థియేటర్స్ లో ఈ సినిమా రన్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 32 కోట్లకు అమ్ముడయ్యాయి. తొలివారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల వరకూ రాబట్టింది .. ప్రపంచ వ్యాప్తంగా 15.7 కోట్లను వసూలు చేసింది.

ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో వచ్చినట్లయితే .. ఈ ఫిగర్ మరింత పెరిగేది. ఈ సినిమా ఇంకా 16 కోట్ల వరకూ రాబడితే అప్పుడు హిట్ కేటగిరీలోకి వెళుతుందని అంటున్నారు. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు గనుక, ఈ వీకెండ్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక  ఈ సినిమా కారణంగా కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ కు వరుస అవకాశాలు వస్తున్నాయట. తన తదుపరి సినిమా వివరాలను వచ్చేనెల 10వ తేదీన చెబుతానని అఖిల్ అనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here