ఆల్ టైం డిసాస్టర్ అయిన “బాహుబలి”

0
375

అదేంటి బాహుబలి తెలుగు సినిమా రికార్డులనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే కొత్త రికార్డులు సృష్టించిన సినిమా అలాంటిది ఆల్ టైం డిసాస్టర్ ఏంటని అనుకుంటున్నారా…నిజంగానే బాహుబలి డిసాస్టర్ అయ్యింది కానీ ఇక్కడ కాదు జర్ననీలో.

bahubali alltime disasterఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా అందరూ పిలుచుకునే బాహుబలి అదే క్రేజ్ తో పోయిన నెల 28 న జర్మనీలో ఘన౦గా రిలీజ్ అయ్యింది. కాగా సినిమాను సుమారు 12 కోట్లకు అక్కడ కొనగా ఇప్పటివరకు అక్కడ కేవలం 10 లక్షలు మాత్రమె కలెక్ట్ చేసింది.

దాంతో అక్కడ ఘోరాతిఘోరమైన ఫ్లాఫ్ ని మూటగట్టుకుంది ఈ సినిమా. మనకు ఇలాంటి కథ చాల కొత్తది కానీ వాళ్ళకు రొటీన్ కథలే అవ్వడంతో ఇలాంటి రిజల్ట్ వచ్చింది అంటున్నారు. మన బాహుబలితో పాటు భాజీరావ్ మస్తానీకి కూడా తీవ్ర నష్టాలు కలిగాయట అక్కడ.

NO COMMENTS

LEAVE A REPLY