సైరా సినిమాకి మరో ఎదురుదెబ్బ..!అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది..?

0
615

ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న151వ సినిమా సైరా నరసింహారెడ్డి.దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.    

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో నటించే నటీనటుల్ని ఎంపిక చేయడానికే చాలా సమయం పట్టింది. ఇంకా ఓ సమస్య చిత్ర యూనిట్ ని వెంటాడుతూనే ఉంది. దానిపై రామ్ చరణ్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నారు కానీ అనుకోని కారణాల వలన రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.అప్పటి నుంచి సరైన సంగీత దర్శకుడి కోసం రామ్ చరణ్ అన్వేషిస్తూ ఉన్నాడగా,

ప్రకారం బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పట్లరామ్ చరణ్  ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీత అందించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here