అరవింద సమేత ఇన్ సైడ్ స్టొరీ..!త్రివిక్రమ్ నుండి ఇలాంటి సినిమాని ఎవ్వ‌రూ ఎక్స్‌ పెక్ట్ చేయరు..!

0
3104

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమాని త్రివిక్రమ్ త‌న స్టైల్ కాస్త మార్చి ఈ స్టొరీను రాసుకున్నాడ‌ని, ఫస్ట్ ఆఫ్ లో ఎన్టీఆర్ – పూజా హెగ్డే మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్ స‌ర‌దాగా అల‌రిస్తుంద‌ని,అయితే ఈ ఫ‌న్ కేవ‌లం ఫ‌స్టాఫ్‌కే ప‌రిమితం చేశాడన్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.   

ఇక సెకండ్ ఆఫ్ లో యాక్ష‌న్ జోరందుకుంటుంద‌ట‌. ఓ యాక్ష‌న్ ఘ‌ట్టం  దాని వెంబ‌డే సెంటిమెంట్ సీన్ – సెకండ్ ఆఫ్ దాదాపుగా ఇలానే సాగింద‌ని తెలుస్తోంది.సెకండాఫ్‌లో సునీల్ చేసే కామెడీనే కాస్త రిలీఫ్ అని, అది మిన‌హాయిస్తే సెకండాఫ్ మొత్తం సీరియెస్ మోడ్‌లోనే సాగుతుంద‌ని తెలుస్తోంది.

త్రివిక్ర‌మ్ నుంచి ఇలాంటి సినిమాని ఎవ్వ‌రూ ఎక్స్‌ పెక్ట్ చేయ‌ర‌ని,అలాంటి సినిమాని త్రివిక్ర‌మ్ అభిమానులకు, ప్రేక్షకులకు ఇవ్వ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్  టాక్. ఈ సినిమాలో త్రివిక్ర‌మ్ ఎమోష‌న్ సీన్ల‌ని ఇంకా బాగా రాసుకుంటాడు. త్రివిక్ర‌మ్ రాసే సీరియెస్ డైలాగులు అభిమానుల‌కు ఇంకా గుర్తుంటాయి. ఆ కోణాన్ని ఈ సినిమాలో మ‌రింత ప‌దునుగా చూపించ‌బోతున్నాడ‌ని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here