టాలీవుడ్ ఆడియో ఫంక్షన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్

0
438

dirctors coemshksతెలుగు సినిమా దర్శకుల జాబితాలో రవిబాబు పేరు ఒక విలక్షణతను చాటుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పరంగా హాలీవుడ్ రేంజ్ లో రవిబాబు సినిమాలున్నా, అవి ప్రేక్షకులను చేరువ కావడంలో మాత్రం ఎక్కడో గతి తప్పుతుంటాయి.

అయితే నచ్చావులే, నువ్విలా, అనసూయ లాంటి కథలు రీచ్ అయితే మాత్రం అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఫలితాలనే అందుకుంటాయన్న విషయాన్ని రవిబాబు గత సినిమాలు చెప్పకనే చెబుతాయి. త్వరలో పందిపిల్ల ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కిస్తున్న రవిబాబు, తన సినిమాలకు ఎలాంటి ఆడియో వేడుకలు గానీ, ఎలాంటి ప్రెస్ మీట్ లను గానీ ఏర్పాటు చేయరు.

మరి దీనికి గల కారణాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్తూ… “ఎందుకు ఆడియో ఫంక్షన్లు… ఆడియో వేడుకలన్నీ సెల్ఫ్ డబ్బాలుగా మారిపోయాయ్… ఏవి అంటారు, వచ్చిన ప్రతి ఒక్కరి గురించి అలా వీడియోలు ప్లే చేసుకుంటూ పోతుంటారు…” అంటూ సమాధానం ఇచ్చారు. అసలే ఏ విషయం మాట్లాడినా పెద్ద వివాదం అవుతున్న ఈ రోజుల్లో రవిబాబు వాఖ్యలు ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తాయో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY