బాహుబలి 2..రోబో 2 లని కాదని ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారట

0
1658

ntr-svtns-tns2017 లో ప్రేక్షకులముందుకు రాబోతున్న సినిమాల్లో ఎక్కువమంది ఎదురుచూస్తున్న సినిమాలు ఏవి అంటే బాహుబలి 2 మరియు రోబో 2 సినిమాలు అని చెప్పాలి.. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల కోసం టోటల్ ఇండియా ఎదురుచూస్తుంది.

కానీ ఆన్ లైన్ లో ఓ లీడింగ్ పత్రిక జరిపిన సర్వేలో ఏ సౌత్ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అన్న ప్రశ్నకి షాకింగ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే 27 వ సినిమా కోసమని ఎక్కువమంది ఓటు వేశారట.

ఈ పోల్ లో సుమారు 4 లక్షల మంది దాకా పాల్గొనగా అందులో 1.4 లక్షల ఓట్లు ఎన్టీఆర్ సినిమాకు పోల్ కాగా బాహుబలి 2 కోసం 1.2 లక్షల ఓట్లు, రోబో 2 కోసం 80 వేల ఓట్లు పోల్ అయ్యాయట. తర్వాత భైరవ, కాటమరాయుడు మరియు మహేష్-మురగదాస్ ల సినిమాలు నిలిచాయట…ఈ రిజల్ట్ తో ఎన్టీఆర్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడుతున్నాయో తేటతెల్లం అవుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY