బాహుబలి-సర్దార్-శ్రీమంతుడు రికార్డులు బ్రేక్ “జనతాగ్యారేజ్ టాప్ ప్లేస్”

0
1328

ntr movki top placesssఇండస్ట్రీ అంతా ఆశగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతాగ్యారేజ్ ఒకటి. 2016 పెద్ద సినిమాలలో ఎక్కువశాతం నిరాశని మిగిలించిగా ఇప్పుడు ఆశలన్నీ ఎన్టీఆర్ సినిమా మీదే పెట్టుకున్నారు అందరూ.

దానికి తగ్గట్లే బిజినెస్ లో హవా చూపిన జనతాగ్యారేజ్ ఇప్పుడు ఆడియో రైట్స్ విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా 2.10 కోట్ల రేటుకి లహరి మ్యూజిక్ కంపనీ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

దాంతో బాహుబలి-సర్దార్ గబ్బర్ సింగ్-శ్రీమంతుడు-బ్రహ్మోత్సవం లాంటి సినిమాలకు దక్కిన 1.5 కోట్ల రికార్డు బ్రేక్ అవ్వడమే కాదు కొత్త బెంచ్ మార్క్ గా 2.10 కోట్ల మార్క్ నిలవబోతుంది. ఈ మార్క్ ని అందుకోవడానికి ముఖ్యమైన కారణం దేవి శ్రీ పై ఉన్న నమ్మకం అయినా సినిమా క్రేజ్ వల్లే ఇంత రేటు దక్కిందని చెప్పొచ్చు. సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రికార్డులు సృష్టించబోతుందో ఈ రికార్డులే నిదర్శనంగా మారబోతున్నాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY