GOSSIPS NEWS

ఇదేమి సెంటిమెంట్ బాలయ్యా…షాక్ అవుతున్నారు

మనిషికి ఎదో ఒక నమ్మకం గట్టిగా ఉంటేనే ముందుకు వెళ్లగలడు. సినిమాల్లో పనిచేసేవారు కూడా కొంచెం నమ్మకాల బాటలో నడవకుండా ఉండలేరు. ఇక అసలు విషయంలోకి వస్తే టాలీవుడ్ స్టార్ హీరో  బాలకృష్ణ కూడా సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారు. పద్ధతులను ఆయన అస్సలు మిస్ అవ్వరు. ఆయనకి దైవ భక్తి కూడా చాలా ఎక్కువే అని అందరికి తెలిసిన విషయమే. సెంటిమెంట్స్ విషయంలో అయితే బాలయ్య బాబు ఏ మాత్రం తేడా రానివ్వరు.

తేడా వస్తే ఆ రోజు చేసేపని క్యాన్సిల్ చేసుకుంటారట. ముఖ్యంగా బాలయ్య  కాస్ట్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని  తెలుస్తోంది. ప్రతి గురువారం ఆయన కొత్త కాస్ట్యూమ్ ని దరించడానికి అస్సలు ఇష్టపడరట. గత 15 ఏళ్ల నుంచే ఆయన ఈ రూల్ ని మరచిపోకుండా పాటిస్తున్నారాని ఆయన సన్నిహిత కాస్ట్యూమ్ డిజైనర్ ద్వారా తెలిసింది. 

ఆయన టైమ్ టేబుల్ ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. షూటింగ్ కి అరగంట ముందే వచ్చి ఆ తర్వాత అవసరమైతే ఎక్కువ సేపు వర్క్ చేయడానికి ఇష్టపడతారట. అయితే ఈ క్రమంలో అనుకోకుండా గురువారం కొత్త కాస్ట్యూమ్ ని ధరిస్తే వెంటనే షూటింగ్ క్యాన్సిల్ అనేస్తారట. 

Leave a Comment