నిర్మాతగా బాలయ్య…పూర్తి డీటైల్స్ ఇవే

0
573

బాలకృష్ణ.. స్వయం గా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి కే ఇతర సీనియర్ హీరోలు అందరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉండగా.. ఇప్పుడు బాలయ్య కూడా ఇదే అమలు పరిచేస్తున్నారు. బాలకృష్ణ 103 వ చిత్రంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ను.. సొంత బ్యానర్ పై తన తొలి మూవీ గా నిర్మించ నున్నారు బాలయ్య. తన నిర్మాణ సంస్థకు బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ అని బాలకృష్ణ నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ ను బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ తో పాటు సాయి కొర్రపాటి.. విష్ణులు కలిసి నిర్మించనున్నారు. ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఓ మాంచి ఆఫీస్ నిర్మాణం ప్రారంభించే పనిలో ఉన్నారు బాలయ్య. తన ఇంటికి దగ్గరలోనే ఆఫీస్ ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్లాట్స్ ను పరిశీలించిన బాలయ్య.. చివరకు ఓ రెండింటిని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తోంది.

వాస్తు సహా ఇతర అన్ని విషయాలను చెక్ చేసుకుని.. ఈ రెండింటిలో ఒకదాన్ని కొనుగోలు చేస్తారట బాలకృష్ణ. ఈ ఆఫీస్ నిర్మాణం శరవేగంగా పూర్తి కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం అయ్యే నాటికే.. దాదాపుగా ఆఫీస్ ను రెడీ చేసేయాలని చూస్తుండడం విశేషంగా చెప్పుకుంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here