బ్రహ్మోత్సవం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అప్ డేట్

0
1214

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం పోయినవారం భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన విషయం అందరికీ తెలిసిందే. భారీ ఆశలు పెట్టుకున్న సినిమా తొలిరోజు నుండే డ్రాప్ అవుతూ వచ్చి తొలివారంలో మహేష్ రేంజ్ కి ఏమాత్రం సంభందం లేని కలెక్షన్స్ ని సాధించింది.

brahmostavam updatessssరెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన నెగటివ్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సవం మొత్తంగా 23.40 కోట్ల షేర్ వసూల్ చేయగా ఓవర్సీస్ లో తన పరుగుని ఆల్ మోస్ట్ ముగింపు దశకు తెచ్చుకుంది. అక్కడ 3.40 కోట్ల షేర్ వసూల్ చేసింది బ్రహ్మోత్సవం.

ఇక కర్ణాటక-మిగిలిన ఏరియాల్లో ఓ మోస్తరు కలెక్షన్స్ తో 3.10 కోట్ల షేర్ వసూల్ చేసిన బ్రహ్మోత్సవం మొత్తంగా తొలివారంలో 29.90 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. విజయం సాధించడానికి 75 కోట్లు కలెక్ట్ చేయాల్సిన దశలో బ్రహ్మోత్సవం ఎంతవరకు వెళుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY