బాలీవుడ్ హీరోలకి కూడా చేయని పని ఎన్టీఆర్ కోసం చేశాడంట ఈయన

0
634

ntr kosam new shsntbయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ ఇప్పటివరకు చూడని విధంగా స్టైలిష్ గానూ ఫుల్ మాస్ లుక్ ఉట్టిపడేలాను కనిపిస్తు౦డటంతో ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ కి మరింతగా ఫిదా అవుతున్నారు.

కాగా సినిమాలో ఎన్టీఆర్ కోసం దాదాపు 250 కాస్ట్యూమ్స్ ని డిసైన్  చేసినట్లు చెబుతున్నారు యూనిట్ వారు. ఈ కాస్ట్యూమ్స్ అన్నీ బాలీవుడ్ దిగ్గజ డిసైనర్ డబూరత్నానీ డిసైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇన్ని డిసైన్లను ఆయన మరింత స్టైలిష్ గా ఫోటోగ్రాఫ్స్ కూడా తీశారట.

ఇవన్నీ బాలీవుడ్ హీరోలకు కూడా చేయలేదని, అక్కడ హీరోలకి ఒక్కో సినిమాకి ఎక్కువలో ఎక్కువ 100 నుండి 120 డిసైన్స్ తోనే పని అయ్యేదని కానీ మొదటిసారిగా సౌత్ లో అడుగుపెడుతుండటంతో తన మార్క్ కనిపించేలా ఉండాలని ఎన్టీఆర్ కోసం ఏకంగా 250 డిసైన్స్ ని వాడినట్లు వాళ్ళు చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY