కెమరామెన్ గంగతో రాంబాబు రికార్డును బ్రేక్ చేయనున్న పవన్ కళ్యాణ్

0
905

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి రెండేళ్ళు రాసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఏడాది మొత్తం షూటింగ్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచింది. కానీ అభిమానులు పవన్ ని మూడేళ్ళు వెండితెరపై చూడలేదు కాబట్టి హిట్ కి ఫ్లాఫ్ ని పట్టించుకోకుండా చూశారు.

pawan new record wantedదాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 53 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ డిసాస్టర్ నుండి కోలుకోవడానికి తన అప్ కమింగ్ మూవీని అతితక్కువ సమయంలో ముగించాలని ఫిక్స్ అయ్యాడు పవర్ స్టార్. దీనికి తగ్గ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట.

ఎస్.జే. సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తన కెరీర్ లో ఫాస్టెస్ట్ మూవీగా పిలవబడే కెమరామెన్ గంగతో రాంబాబు 80 రోజులు కన్నా తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. అదే జరిగితే అభిమానులకు అంతకుమించిన సంతోషం ఉండదు.

NO COMMENTS

LEAVE A REPLY