రామ్ చరణ్ ని కలవాలంటే 7000 ఇవ్వాలట

0
468

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర రికార్డులను బ్రేక్ చేయాలని చరణ్ ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇప్పటివరకు ఆ పనిని చేయలేకపోయాడు. అందునా ఇక్కడ మార్కెట్ ని పెంచుకున్నా ఓవర్సీస్ లో చరణ్ మార్కెట్ నిల్ అనే చెప్పాలి.

ఇలాంటి సమయంలో తన లేటెస్ట్ మూవీ ధృవతో అక్కడ ఎలాగైనా దుమ్ము రేపాలని ఫిక్స్ అయిన చరణ్ తన సినిమా ధృవ రిలీజ్ సమయంలో అక్కడే ఉండి చాలా ఏరియాల్లో ఓన్ ప్రమోషన్ చేసుకుని ఈ సారి గట్టిగా కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.

కాగా ఈ సందర్భంగా రామ్ చరణ్ ని థియేటర్ లో లైవ్ గా చూడాలి అంటే కనీసం 7000(105$) ఇచ్చుకోవాల్సి ఉంటుందట. ఇలా తన క్రేజ్ ని క్యాష్ చేసుకుని తన మార్కెట్ ని పెంచుకోబోతున్నాడు రామ్ చరణ్. ధృవ అక్కడ మినిమమ్ 2 మిలియన్ డాలర్స్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. మరి ఆ టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY