రామ్ చరణ్ సుకుమార్ ల మూవీ “ఫుటేజ్” మాయం…అసలేం జరిగిందంటే!!

0
87

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాస్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న ‘రంగస్థలం’ .. షూటింగ్ పరంగా చివరి దశకు చేరుకుంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, సాంగ్స్ షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతోందట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పూర్తి రషెస్ ను ఇటీవల టీమ్ అంతా కలిసి చూశారట.

ఆ సమయంలోనే కొన్ని టెక్నీకల్ ప్రొబ్లమ్స్ వలన హార్డ్ డిస్క్ లోని కొంత ఫుటేజ్ ఎగిరిపోయినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. చరణ్ .. సమంతా కాంబినేషన్లో చేసిన కొన్ని సీన్స్ .. హార్డ్ డిస్క్ నుంచి ఎగిరిపోయాయని అంటున్నారు. ఆ సీన్స్ ను రీ షూట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోందనీ, మళ్లీ కాల్షీట్స్ ఇవ్వడానికి చరణ్ కూడా ఓకే చెప్పేశాడనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే చెప్పారు. జరిగిన సంఘటన ప్రభావం విడుదల తేదీపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here