ఆ దర్శకున్ని మరోసారి లైట్ తీసుకున్న రామ్ చరణ్

0
5485

ప్రస్తుతం ఆ డైరెక్టర్ టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్…ప్రతీ హీరో ఆ డైరెక్టర్ తో పనిచేయాలని తెగ ఆరాటపడుతున్నారు. కానీ చాన్స్ అందరికీ ఒకేసారి రాదు కాబట్టి ముందుగా ఓ కుర్ర హీరోతో సినిమా చేయబోతున్నాడు ఆ దర్శకుడు.

ఆ డైరెక్టరే కొరటాల శివ…ప్రస్తుతం ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ తీసిన కొరటాల అసలు లెక్కకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలి. కానీ అప్పుడు ఆగిపోయిన సినిమా ఇప్పుడు తిరిగి మొదలు అవుతుంది అనుకుంటే కొరటాల మహేష్ తో సినిమాను మొదలుపెట్టబోతున్నాడు.

దాంతో కొరటాలని లైట్ తీసుకున్న రామ్ చరణ్ తరువాత డేట్స్ అన్నీ సుకుమార్ కే ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత అయినా కొరటాల చరణ్ తో చేస్తాడు అనుకుంటే ఎన్టీఆర్ తో మరోసారి సినిమా చేయబోతున్నాడు కొరటాల…దాంతో మరోసారి కొరటాలని లైట్ తీసుకోబోతున్నాడు రామ్ చరణ్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY