కన్ఫాం::-మెగాస్టార్ 150 లో రామ్ చరణ్ కూడా కనిపిస్తాడు

0
755

ram charan in chiru 150thమెగాస్టార్ చిరంజీవి మైటీ 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఏమాత్రం బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా చివరివరకు ఆగకుండా జరుగుతుందని చిత్ర దర్శకుడు వివివినాయక్ ఈ మధ్యనే కన్ఫాం చేశాడు.

కాగా సినిమాలో మెగాస్టార్ లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అలాగే కథలో కూడా భారీ మార్పులు చేసినట్లు వినాయక్ చెబుతున్నాడు. ఇక సినిమాలో కచ్చితంగా కనిపిస్తానని ఎప్పటి నుండో చెబుతున్న రామ్ చరణ్ కోరికని కూడా తీర్చబోతున్నాడట వినాయక్.

మార్చిన స్టోరీలో ఓ చిన్న బిట్ ఉందని అందులో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు తన సన్నిహితులతో చెప్పాడట. దాంతో మరోసారి మెగాస్టార్ మరియు రామ్ చరణ్ వెండితెరని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY