ధృవ 3 వీక్స్ కలెక్షన్స్ అప్ డేట్

0
646

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలు పూర్తి చేసుకుంది…కాగా సినిమా తొలిరోజు బిగ్ డ్రాప్స్ చూసి కనీసం 45 అయినా క్రాస్ అవుతుందా అన్న అనుమానాలు కలిగాయి ట్రేడ్ లో.

కానీ యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ధృవ ఆ పాజిటివ్ టాక్ నే నమ్ముకోగా ఇప్పుడు ఫలితాలు ధృవకి అనుకూలంగా వచ్చాయి. మూడు వారాల్లో ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల షేర్ దాకా వసూల్ చేసినట్లు అంచనా.

ఇందులో నైజాంలో 14.26 కోట్ల షేర్ వసూల్ చేయగా సీడెడ్ లో 6.40 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక ఆంధ్రా ఏరియాలో 18 కోట్లదాకా షేర్ వసూల్ చేసింది, ఇక కర్ణాటకలో 6.5 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ధృవ ఓవర్సీస్ లో 5.50 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక మిగిలిన ఏరియాల్లో 2.8 కోట్లవరకు కలెక్ట్ చేసినట్లు అంచనా.

NO COMMENTS

LEAVE A REPLY