ధృవ డే 6 బాక్స్ ఆఫీస్…UPDATE

0
1468

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 5 రోజుల్లో 39 కోట్లవరకు షేర్ కలెక్ట్ చేసి స్టడీగా సాగుతుంది. కాగా 5 వరోజు సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవ్వడంతో ట్రేడ్ లో టెన్షన్ మొదలైంది.

ఇక 6 వరోజు కూడా డ్రాప్స్ కంటిన్యూగా సాగుతున్నాయి. ఏ సెంటర్స్ లో బిలో యావరేజ్ గా సాగుతున్న ఓపెనింగ్స్….బి, సి సెంటర్స్ లో మరింతగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ 2 కోట్లు వస్తే గొప్ప విషయమే అంటున్నారు ట్రేడ్ పండితులు.

మరోపక్క సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకుని ఈ మార్క్ అందుకున్న తొలి రామ్ చరణ్ సినిమాగా రేర్ రికార్డును నెలకొల్పింది. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అక్కడ మరో 0.7 మిలియన్ కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY