ఈసారి విద్వంసమే అంటున్న యంగ్ టైగర్

0
6398

టెంపర్-నాన్నకుప్రేమతో విజయాలు ఎన్టీఆర్ లో ఎక్కడ లేని ఫాన్ఫిడెన్స్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల విడుదల సమయంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని అనుకున్న విధంగా సినిమాను విడుదల చేయలేకపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ntr new aimఅయినా కూడా ఎన్నో ఒత్తిడులను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా ఇప్పుడు తన కెరీర్ లోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా మారిన జనతాగ్యారేజ్ విషయంలో పైన రెండు సినిమాలకు ఏర్పడ్డ అవరోధాలు జరగవని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు ఎన్టీఆర్.

విడుదల తేదిని ముందే అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ అప్పటికి సినిమా అయిపోయి  నెల రోజులు అవుతుందని అంటున్నాడట. అంటే జూన్ లో సినిమా మొత్తం పూర్తి అయ్యి జులైలో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 12 ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందట. ఇన్ని అడ్డంకుల నడుమ రిలీజ్ అయిన నాన్నకుప్రేమతో సినిమాతో 55 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఎన్టీఆర్ సోలో రిలీజ్ కాబట్టి కుమ్మెస్తాడు అని చెప్పొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY