ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లా ఉండాలి అంటున్న టాలీవుడ్

0
816

ntr fans greatఅభిమానం కట్టలు తెచ్చుకోవడం ఒక్క టాలీవుడ్ లో ఉన్నట్లు మరే ఇండస్ట్రీలో ఉండదని అందరూ చెప్పేవారు. కానీ ఈ మధ్య మనల్ని మించి తమిళ్ లో హీరోల అభిమానులు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక తెలుగులోనూ ఈ ఒరవడి మరింత పెరిగి ఈ ఈవెంట్ అయినా అభిమానులు హీరో తప్ప మరెవ్వరూ మాట్లాడకుండా చేయడం ఒకవేళ మాట్లాడితే వాళ్ళు తమ హీరో గురించే చెప్పాలని చేయడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం.

కానీ రీసెంట్ గా జరిగిన జనతాగ్యారేజ్ ఆడియో ఈవెంట్ నే తీసుకుంటే కొరటాల శివ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు కొద్దిగా రేచ్చిపోగా వెంటనే ఎన్టీఆర్ మైక్ తీసుకుని దర్శకుడికి మాట్లాడే చాన్స్ ఇవ్వండీ అని ఇలా చెప్పాడో లేదో వెంటనే అందరూ సైలెంట్ అయ్యి ఓ మాస్టారు చెబితే ఎలా వింటారో అలా విన్నారు. ఇది చూసిన టాలీవుడ్ పెద్దలు ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లా ఉండాలి అంటూ మెచ్చుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY