ఫైనల్ గా 4…మరి గెలుపు ఎవరిదో మీరే చెప్పండి??

0
388

ప్రతి ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి మొదట చాలామంది స్టార్ హీరోలు వద్దామని అనుకున్నారు. కానీ పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుండడంతో కొంతమంది డ్రాప్ అయ్యారు.  జనవరి 10న రిలీజ్ కాబోయే అజ్ఞాతవాసి సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక న్యూ ఇయర్ సందర్బంగా సినిమా స్థాయి పెరిగేలా ఉంది. ఎందుకంటే పవన్ పాడిన పాట ఆరోజే రిలీజ్ అవుతోంది.

 

ఇక బాలయ్య విషయానికి వస్తే కాస్త ఆలస్యంగానే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసినా కూడా జై సింహ టీజర్ తో అభిమానులకు ఊపును ఇచ్చాడు. ఎక్కువగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆడియో వేడుకను చేసి కొంచెం హడావుడిని ఎక్కువగానే పెంచాడు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక పవన్ – బాలయ్య తో పోటీ పడటానికి సూర్యా కూడా గ్యాంగ్ అనే సినిమాతో కూడా 12న  రాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ ఆ సినిమాను రిలీజ్ చేస్తోంది. అయితే ఆ సినిమా ట్రైలర్ తప్పితే ఎంతవరకు ఎలాంటి హైప్ ని క్రియేట్ చేసుకోలేదు. 


ఫైనల్ గా రాజ్ తరుణ్ ఈ స్టార్ హీరోల మధ్యన రాజుగాడు  అనే సినిమాతో రాబోతున్నాడు. రిలీజ్ డేట్ అయితే చెప్పారు గాని. ఇంకా సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. మరి సంక్రాంతికి ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారో.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here