వీకెండ్ తర్వాత గరుడ వేగ పరిస్థితి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు??

0
789

‘గరుడవేగ’ సినిమాకు తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ ఈ సినిమాకు మౌత్ టాక్.. రివ్యూలు చాలా బాగా రావడంతో సినిమా భలేగా పుంజుకుంది. తొలి రోజు సాయంత్రానికే హౌస్ ఫుల్స్ పడగా.. తర్వాతి రెండు రోజుల్లో వసూళ్లు మరింతగా పుంజుకున్నాయి. ఫస్ట్ డే రూ.65 లక్షలు మాత్రమే షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో రూ.2.8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. నిజానికి ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఉండుంటే వసూళ్లు ఇంకా పెరిగేవే. రెండో రోజు నుంచి థియేటర్లు, స్క్రీన్లు కొంచెం పెరిగినప్పటికీ సరిపోలేదు.

ఐతే సానుకూలమైన విషయం ఏంటంటే.. వీకెండ్ తర్వాత ‘గరుడవేగ’ వసూళ్లలో పెద్ద డ్రాప్ ఏమీ కనిపించలేదు. సోమవారం వసూళ్లు కొంచెం తగ్గాయి కానీ.. అవి రీజనబుల్‌గానే ఉన్నాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ బాగా కనిపించింది. పోటీగా వేరే సినిమాలేవీ లేకపోవడంతో ఇంకో మూడు రోజులు ఓ మోస్తరుగానే వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ‘గరుడవేగ’ టీం ప్రమోషన్లు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది.

సోమవారం సెలబ్రెటీలకు స్పెషల్ షో వేసి.. అందరితోనూ ఈ సినిమా గురించి మాట్లాడించింది. సక్సెస్ మీట్ కూడా పెట్టి దాన్ని బాగా ఆర్గనైజ్ చేసింది. ఇది సినిమాకు కలిసొచ్చే అంశమే. ఈ శుక్రవారం ఒకటికి ఐదు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ‘ఒక్కడు మిగిలాడు’, ‘కేరాఫ్ సూర్య’ సినిమాల నుంచి దీనికి పోటీ ఉంటుంది. ఆ సినిమాలకు టాక్ ఎలా వస్తుందన్నదాన్ని బట్టి ‘గరుడవేగ’ రెండో వీకెండ్ వసూళ్లు ఆధారపడి ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here