గరుడవేగ ఫ్లాఫ్ అనుకున్న….షాకింగ్ కామెంట్స్ చేసిన రాజశేఖర్

0
495

PSV గరుడవేగ విడుదలకు మూడు వారాల ముందు రాజశేఖర్ తల్లి చనిపోయింది. అలాగే ఈ సినిమా విడుదలకు రెండే రోజుల ముందు జీవిత సోదరుడు మురళి మరణించాడు. ఇలా జరిగాక తనకు సినిమా మీద నమ్మకం పోయిందని రాజశేఖర్ చెప్పాడు. తన జీవితంలో వరుసగా బాధాకరమైన పరిణామాలు జరగడంతో తన టైం బాగా లేదని అనుకున్నానని.. చెన్నైలో భారీ వర్షాలు పడుతుండటంతో.. అవి తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించి సినిమా సరిగా ఆడదేమో అనుకున్నానని.. కానీ అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదని..

జనాలు కూడా సినిమాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని రాజశేఖర్ చెప్పాడు. తన తల్లి చనిపోయినప్పటికీ.. తనకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లులున్నారని.. తనకు లేడీస్ లో ఫాలోయింగ్ బాగా ఉందని నమ్ముతానని.. కాబట్టి కుర్రాళ్లు తమ తల్లుల్ని ‘గరుడవేగ’ సినిమాకు తీసుకెళ్లాలని తాను కోరానని.. చాలామంది అలాగే చేశారని..

ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్లి ఈ విషయం ప్రస్తావిస్తే.. నా కొడుకు నన్ను తీసుకురావడమేంటి.. నేనే వాడిని తీసుకొచ్చా అందని రాజశేఖర్ అన్నాడు. ‘గరుడవేగ’ విషయంలో చిరంజీవి – బాలకృష్ణలతో పాటు ఎంతోమంది తమ సపోర్ట్ అందించారని.. అందరికీ రుణపడి ఉంటానని రాజశేఖర్ అన్నాడు. తాను చిరంజీవిని కలవడం మీద మీడియాలో రకరకాల వార్తలొచ్చాయని.. తమ మధ్య దూరం పెంచొద్దని రాజశేఖర్ కోరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here