గూగుల్ లో TARAK అంటే ముఖ్యమంత్రి అని అర్ధం

0
190

ntr name on googleజూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర ప‌డిపోతున్నారు. అదేంటి జ‌న‌తా గ్యారేజ్ సినిమా విడుద‌ల అవ‌డానికి చాలా టైం ఉంది క‌దా? ఇప్పుడే వారి సంబ‌రాల‌కు అంత‌ తొంద‌రేంటి? అనుకుంటున్నారేమో. ఈ సంబ‌ర‌మంతా జ‌న‌తా గ్యారేజీ తెచ్చిపెట్టిందికాదు. ఇదంతా గూగుల్ తెచ్చిపెట్టిన సంతోషం. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్ర‌చారం చేస్తోంది గూగుల్‌.

మ‌రి ఈ వార్త ఆయ‌న అభిమానుల‌కు పండ‌గ‌కాక మ‌రేంటి.  గూగుల్ కు ఉన్న ఫీచర్స్ లో గూగుల్ ట్రాన్స్ లేట్ ఒకటి. ఇందులో మనకు కావలసిన పదం టైప్ చేస్తే దానికి అర్థం యేభాషలో కావాలో ఆ భాషలో చూపిస్తుంది.  అలా tarak అని ఇంగ్లీష్ లో టైప్ చేసి తెలుగులో అర్థం వెతికితే ‘ముఖ్యమంత్రి’ అని చూపిస్తోంది. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు తెగ సంబ‌రప‌డిపోతున్నారు.

తార‌క్ తాత దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడమే కాదు పోలికల్లో కూడా తాతలానే ఉంటాడు. అటు సినిమాల ప‌రంగా, ఇటు రాజ‌కీయంగా  కూడా జూనియ‌ర్ వాగ్దాటి, ప్ర‌జాభిమానం అంతా తాత‌నే పోలి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఎప్ప‌టికైనా సీఎం అవుతార‌న్న అంచ‌నాలు ఎప్ప‌టి నుంచో ఉన్న సంగ‌తి తెలిసిందే. 2009 ఎన్నిక‌ల్లో సైతం ఎన్టీఆర్ త‌న తాత స్థాపించిన టీడీపీ విజ‌యం కోసం ప్ర‌చారం చేశాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY