హైపర్ ని పీకేసి జనతాగ్యారేజ్ వేస్తున్నారు

0
3342

nter-sb-ntns-tనేను శైలజ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా చేసిన సినిమా హైపర్…లాస్ట్ వీక్ భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాలో అక్కడక్కడ స్టొరీ బాగానే ఉన్నా టోటల్ గా ఓ 10 తెలుగు సినిమాల నుండి పిండిన కిచిడిలా ఉందని విమర్శలు కూడా బాగానే ఎదుర్కొంది సినిమా.

కాగా వీకెండ్ ముగిసే సరికి సినిమా కోసం కేటాయించిన థియేటర్స్ లో తిరిగి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ని ప్రదర్శిస్తున్నారట. దాంతో సినిమా దసరా వరకు సుమారు 140 థియేటర్స్ లో ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

రామ్ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం…కందిరీగనే తిరిగి మళ్ళీ తీసిన ఫీలింగ్ రావడంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. దాంతో వీకెండ్ లో కేవలం 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన హైపర్ రామ్ కి మరో ఫెల్యూర్ అయ్యేలా కనిపిస్తుంది. దాన్ని జనతాగ్యారేజ్ అడ్వాంటేజ్ గా తీసుకోబోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY