ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం అంటున్న హీరో ఇతనే

0
3893

నటుడిగా ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉందని వారు ఉండరనే చెప్పాలి. టాలీవుడ్ లో హిట్లకు ఫ్లాఫ్స్ కి అతీతంగా సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ పై ఇతర హీరోలు కూడా తమ మనసులో మాటలను చెబుతూ ఎన్టీఆర్ క్రేజ్ ని మరింత పెంచుతున్నారు.

కాగా అప్ కమింగ్ హీరోలలో ప్రామిసింగ్ హీరోగా ఎంటర్ అయ్యి మధ్యలో స్లో అయ్యి ఇప్పుడు వరుస సినిమాలతో వస్తున్న నాగశౌర్య టాలీవుడ్ లో ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వీర లెవల్ ఫ్యాన్ అని అంటున్నాడు.

ఎన్టీఆర్ సినిమాలను ఇండస్ట్రీ కి రాకముందు నుండి చూసే వాడినని…బ్యానర్స్ కట్టడం లాంటివి అనేకం చేశానని చెబుతున్న నాగశౌర్య ఎన్టీఆర్ నటన అంటే నాకు ఎంతో ఇష్టమని నటుడిగా ఎన్టీఆర్ ని ఇష్టపడినంతగా మరే హీరో ని ఇష్టపడలేదని చెబుతున్నాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగశౌర్య మాటలకు ఫిదా అవుతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here