ఇంద్రసేనుడికి అలాంటి డైలాగ్స్ కావాలట

0
497

ప్రస్తుతం సెట్స్ పైనున్న మెగాస్టార్ “కత్తిలాంటోడు” సినిమాకు రచనా సహకారం, డైలాగ్స్ అందించే బాధ్యతను పరుచూరి బ్రదర్స్ పైన పెట్టారు దర్శకుడు వినాయక్ మరియు మెగాస్టార్.

త్రివిక్రమ్ లాంటి షార్ట్ అండ్ సింపుల్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఆశిస్తున్న నేటి తరుణంలో అవుట్ డేటెడ్ పరుచూరి వంటి వారిని ఎంపిక చేయడం మెగా అభిమానులకు కాస్త షాకింగ్ విషయమే అయినా… అంతులేని పరిజ్ఞానం పరుచూరి బ్రదర్స్ సొంతం కావడంతోనే ఈ గురుతర బాధ్యత వారి వద్దకు చేరింది.

chiru indraఅందులోనూ మెగాస్టార్ తో ‘ఇంద్ర’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన ఘనత పరుచూరి సోదరులది. తాజా సినిమాకు కూడా ‘ఇంద్ర’ లాంటి డైలాగ్స్ నే దర్శకుడు వివి వినాయక్ కావాలంటున్నారట.

చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించనున్న ఈ సినిమాలో ఒక పాత్ర అభిమానులను మెప్పించే విధంగా ఉంటుందని, మరో పాత్ర మెగాస్టార్ మెచ్చిన పాత్ర అని, రైతుల సమస్యల పట్ల లోతుగా అధ్యయనం చేసి మరీ సంభాషణలు రాయాలని సూచించినట్లుగా పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY