ఇంకో 3 లక్షలు కొడితే ఎన్టీఆర్ కెరీర్ లో ప్రతిష్టాత్మక రికార్డ్…ఎక్కడో తెలుసా??

0
851

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశశ బాక్స్ అఫీస్ దగ్గర టోటల్ రన్ ను ఆల్ మోస్ట్ ముగించినా సుమారు 10 కి అటూ ఇటూగా థియేటర్స్ లో రన్ అవుతుంది. వాటిలో RTC X ROADS కూడా ఒకటి అని చెప్పొచ్చు. కాగా టాలీవుడ్ హీరోలలో ఈ సెంటర్ లో ప్రతీ ఒక్కరికీ కనీసం ఒక్కసారైనా 1 కోటి గ్రాస్ ని సింగిల్ థియేటర్ లో అందుకున్న అల్టిమేట్ రికార్డ్ ఉంది.

కానీ ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటి వరకు ఈ మార్క్ ని ఇక్కడ అందుకోలేకపోయాయి. అప్పట్లో ఆది, సింహాద్రి ఇక్కడ 80 లక్షలకు పైగా గ్రాస్ అందుకోగా 2016 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ 90 లక్షలవరకు గ్రాస్ వసూల్ చేసింది. కాగా ఇప్పుడు రిలీజ్ అయిన జైలవకుశ…..

భారీ పోటి లో కూడా ఇక్కడ 97 లక్షల గ్రాస్ ని అందుకుని రోజు మినిమం 30 వేల నుండి 40 వేల రేంజ్ లో కలెక్షన్స్ ని ఇంకా సాధిస్తుంది. దాంతో మరో 3 లక్షలు వసూల్ చేయగలిగితే ఈ ఏరియాలో ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటి 1 కోటి గ్రాసర్ సినిమాగా నిలిచే చాన్స్ ఉంది…మరి సినిమా పరుగు ముగించే లోపు ఈ రికార్డ్ కొడుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here