ఇంత కష్టపడితే 7 కొట్లేనా…అందరూ షాక్

0
2706

రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ పీఎస్వీ గరుడవేగకు.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన టాక్ వచ్చింది. అలాగే రివ్యూ రైటర్స్.. విమర్శకులు కూడా మూవీ కంటెంట్ ను తెగ పొగి డేశారు. అంతా బాగానే ఉంది కానీ.. పేరులోను.. కంటెంట్ లోను ఉన్న వేగం.. కలెక్షన్స్ లో మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఈ చిత్రం థియేట్రికల్ వసూళ్ల రూపంలో 7 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. మొత్తం 12 కోట్లను వసూలు చేస్తే కానీ..

ఈ సినిమాను హిట్టు మూవీ కింద జమ కట్టే పరిస్థితి లేదు. నిజానికి ఈ మూవీ బడ్జెట్ ఇంతకంటే ఎక్కువే కానీ.. ఆ మాత్రం అమ్మేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయితే.. టాక్ కు తగినట్లుగా వసూళ్లు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ  మూవీని ప్రమోట్ చేసే విషయంలో చేసిన కొన్ని పొరపాట్లే.. ఇలాంటి పరిస్థితికి కారణమేమో అనే విశ్లేషణలు మొదలయ్యాయి.

నిజానికి టీజర్.. ట్రైలర్ లతో మంచి బజ్ క్రియేట్ చేసిన గరుడవేగ మూవీకి.. సన్నీ లియోన్ ప్రచారం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. మూవీలో ఆ భామ పాట కూడా అంతగా ఆకట్టుకున్నదీ లేదు. మూవీ కంటెంట్ ను వదిలేసి.. క్రౌడ్ పుల్లింగ్ కాన్సెప్ట్ కింద సన్నీలియోన్ ను అనవసరంగా తీసుకొచ్చారనే టాక్ వినిపిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here