ఉత్తరాంధ్రాలో జైలవకుశ ఫైనల్ కలెక్షన్స్…ఆల్ టైం టాప్….???

0
809

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ పరుగును ముగించగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో ఈ సినిమా 61 కోట్లు….టోటల్ వరల్డ్ వైడ్ గా 81.5 కోట్ల షేర్ ని అందుకుని ప్రపంచవ్యాప్త గ్రాస్ 145 కోట్ల మార్క్ ని అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించి భీభత్సం సృష్టించింది ఈ సినిమా.

కాగా సినిమా ఫైనల్ కలెక్షన్స్ లో ఉత్తరాంధ్రాలో సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ అక్కడ ఆల్ టైం టాప్ 5 లో చోటు దక్కించుకోవడం విశేషం అనే చెప్పాలి. అక్కడ జైలవకుశ టోటల్ రన్ లో 7.4 కోట్ల షేర్ ని అందుకుంది…అది కూడా GST లో అందుకోవడం విశేషం.

ఒకవేళ GST కనుక లేకుంటే సినిమా కలెక్షన్స్ 8.5 కోట్ల మేర ఉండే చాన్స్ ఉంది. కానీ GST వల్ల నష్టపోయిన ఈ సినిమా అక్కడ బాహుబలి2, ఖైదీనంబర్ 150, బాహుబలి మరియు సరైనోడు తర్వాత ప్లేస్ లో నిలిచింది. ఎన్టీఆర్ అక్కడ బాక్ టు బాక్ 7 కోట్ల సినిమాలతో సంచలనం సృష్టించాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here