పీక్స్ లో భీభత్సం….జైసింహా కి సోషల్ మీడియాలో ఎన్ని ట్వీట్స్ పడ్డాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
255

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైసింహ అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ తర్వాత వచ్చిన పైసా వసూల్ భారీ నిరాశని మిగిలించడం తో నందమూరి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువ కానీ విధంగా సినిమా పోస్టర్ రిలీజ్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.

కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అయిన అతికొద్ది సమయాల్లోనే ట్రెండ్ అవ్వడం కామన్ అయిపొయింది. బాలయ్య సినిమా కూడా ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో లేదో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కాగా సినిమా ఫస్ట్ లుక్ పై మొత్తం మీద ఎన్ని ట్వీట్స్ పడ్డాయో తెలుసా…

సుమారు 57 వేల ట్వీట్స్ 24 గంటల వ్యవధిలో పడినట్లు సమాచారం… సీనియర్ హీరోల లో ఫస్ట్ లుక్ పోస్టర్ కి మొదటి 24 గంటల్లో ఇది రికార్డ్ స్థాయి ట్వీట్స్ అని అంటున్నారు. ఇక త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ టీసర్ ని రిలీజ్ చేయనున్నారట యూనిట్ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here