జైసింహా వైజాగ్ బిజినెస్…దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బాలయ్య

0
544

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ పైసా వసూల్ అంచనాలు అందుకోవడం లో విఫలం అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు బాలయ్య చేస్తున్న లేటెస్ట్ మూవీ జైసింహా పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి కారణం సినిమా కి సింహా సెంటిమెంట్ తోడవ్వడం అని చెప్పొచ్చు. కాగా షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ కి వచ్చేసిన ఈ సినిమా అఫీషియల్ టీసర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.

కాగా సినిమా బిజినెస్ వ్యవహారాలు ఇప్పటి నుండే మొదలు అయ్యాయని చెప్పొచ్చు. అన్ని ఏరియాల నుండి సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. కాగా బిజినెస్ లో భాగంగా సినిమా కు వైజాగ్ ఏరియాలో మంచి రేటు దక్కినట్లు ట్రేడ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

సుమారు 4.2 కోట్ల మేర రేటు బాలయ్య సినిమాకు వచ్చినట్లు సమాచారం. మరి ఇది GST కలిపా లేదా అనేది తెలియాల్సి ఉంది. పైసావసూల్ లాంటి ఫ్లాఫ్ తర్వాత కూడా బాలయ్య సినిమా కి బిజినెస్ సూపర్బ్ గా జరగడం తో ట్రేడ్ కి షాక్ ఇస్తూ బాలయ్య తన మాస్ పవర్ ఏంటో చూపిస్తూ దూసుకుపోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here