జనతాగ్యారేజ్ 35 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

0
1558

ntr-sbs-nttwయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ 5 వ వారంలోను మినిమమ్ కలెక్షన్స్ తో సత్తా చాటుతూనే ఉంది..దసరా హాలిడేస్ వస్తుండటంతో కొత్త రిలీజ్ లు ఉన్నా జనతాగ్యారేజ్ కి ఉన్న మెయిన్ థియేటర్స్ మాత్రం అలాగే ఉండే అవకాశం ఉండటంతో కలెక్షన్స్ రావడం పక్కా అనిపిస్తుంది.

డానికి కారణం సినిమా వీకెండ్స్ లో కలెక్ట్ చేస్తున్న తీరు అద్బుతమని చెప్పొచ్చు. అందుకే దసరాకి సినిమాను చూసేవారు ఉండటం ఖాయమని నమ్మకంతో అలాగే థియేటర్స్ లో ఉంచుతున్నారు. ఇక 35 డేస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.5 కోట్ల మార్క్ ని అందుకుంది జనతాగ్యారేజ్.

ఈ మార్క్ అందుకున్న రెండో తెలుగు సినిమాగా జనతాగ్యారేజ్ రికార్డు సృష్టించగా మొత్తంమీద 83.24 కోట్లతో జనతాగ్యారేజ్ పరుగు కొనసాగుతుంది. మరి దసరా వరకు 85 కోట్ల మార్క్ అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది.

NO COMMENTS

LEAVE A REPLY