ఎవ్వరూ ఊహించని చోట జనతాగ్యారేజ్ ఆడియో వేడుక

0
2653

టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి రెండు వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మిర్చి-శ్రీమంతుడు లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తరువాత కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా జనతాగ్యారేజ్ పై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు ఉన్నాయి.

ntr janata garage audodsopఆ అంచనాలకు తగ్గట్లే సినిమా కూడా రూపొందుతున్నది అంటూ యూనిట్ సినిమాపై ఉన్న క్రేజ్ ని డబుల్ చేస్తున్నారు. కాగా సినిమా టీసర్ ని జులై 6 న రిలీజ్ చేయబోతుండగా ఆడియోని జులై 23 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ ఆడియో వేడుకకి ఎవ్వరూ ఊహించని విధంగా ఖమ్మంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఎప్పుడూ ఫంక్షన్ హాల్స్ లో చేయడమేనా అప్పుడప్పుడు అభిమానుల సమక్షంలో చేయాలి అని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమే అయితే ఖమ్మంలో ఆడియో వేడుక జరుపుకోబోతున్న తొలి సినిమా ఇదే అవుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY