పోటి నుండి తప్పుకున్న కళ్యాణ్ రామ్…కానీ!!

0
558

టాలీవుడ్ లో సమ్మర్ వచ్చిందంటే చాలు కుప్పలు కుప్పలుగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  హాలిడేస్ టైమ్ కావడంతో నిర్మాతలు ఎలాగైనా ఇదే సరైన సమయమని సినిమా మీద కాస్త నమ్మకం ఉంటే చాలు భారీగా రిలీజ్ చేస్తారు. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలకు మరో సినిమాల రిజల్ట్ ప్రభావం బాగానే ఎసరుపెడుతున్నాయి. దీంతో హాలిడేస్ అని మురిసిపోకుండా కొందరు సమ్మర్ ఫైట్ కి దూరంగా ఉంటున్నారు.  కళ్యాణ్ రామ్ – తమన్నా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నా నువ్వే సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేద్దామని అనుకున్నారు.

కానీ ప్రస్తుతం మహానటి హవా గట్టిగా నడుస్తోంది. మహేష్ భరత్ అనే నేను కూడా ఇంకా నడుస్తోంది. దాదాపు థియేటర్స్ అన్ని అవే ఎక్కువగా కవర్ చేశాయి. అందువల్ల కళ్యాణ్ రామ్ లవ్ స్టోరీ రిస్క్ లో పడకూడదని ఆ సినిమా నిర్మాతలు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. కూల్ గా జూన్ లో సినిమాను విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. 

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉


ఇప్పటికే వర్మ తన ఆఫీసర్ ని కూడా వాయిదా వేశాడు. జూన్ 1న ఆ సినిమా రానుంది. సమంత – విశాల్ తమిళ్ డబ్ మూవీ అభిమన్యుడు అలాగే నాగ శౌర్య అమ్మమ్మ గారిల్లు నెక్స్ట్ వీక్ రిలీజ్ చెయ్యాలి అనుకున్నా కుదరలేదు. ఇక ఫైనల్ గా వచ్చే వారం మాస్ రాజా రవితేజ – నేల టిక్కెట్టు ఒంటరిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా దీన్ని ఎంతవరకు అడ్వాంటేజ్ గా తీసుకుంటుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here